![]() |
![]() |
.webp)
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'గుంటూరు కారం'పై భారీ అంచనాలు ఉన్నాయి. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రూపంలో మరో అదనపు ఆకర్షణ తోడైనట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే. అలాగే పవన్, మహేష్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. గతంలో పవన్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'జల్సా' సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ అందించాడు. ఆ చిత్రానికి ఆయన అందించిన వాయిస్ ఓవర్ చాలా ప్లస్ అయింది. అయితే ఇప్పుడు మహేష్ సినిమా కోసం పవన్ ఆ బాధ్యతను తీసుకుంటున్నట్లు సమాచారం.
'గుంటూరు కారం' చిత్రానికి పవన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడట. ఆయన వాయిస్ తోనే మహేష్ పాత్ర పరిచయం కానుందట. అసలే మహేష్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోతుంది. దానికి తోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం బలానికి పవన్ వాయిస్ తోడైతే ఇంట్రడక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |