![]() |
![]() |

నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'దేవర'. 'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.
కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'డెవిల్' డిసెంబర్ 29న విడుదల కానుంది. మంగళవారం జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ దేవర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేసిన తర్వాత ఒక యాక్టర్ కి గానీ, డైరెక్టర్ కి గానీ, ప్రొడక్షన్ హౌస్ కి గానీ ఎంతో బాధ్యత ఉంటుంది. కథలో గానీ, విజువల్ లో గానీ చిన్న తప్పు జరిగినా ప్రేక్షకులు ఊరుకోరు కదా. అందుకే దానిని బాధ్యతగా తీసుకొని, మీరందరూ మెచ్చే అవుట్ పుట్ ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నాము. త్వరలో గ్లింప్స్ రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. మాకు విజువల్స్ ఎఫెక్ట్స్ కి చాలా టైం పడుతుంది. ఎందుకంటే దేవరలో మీరొక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాం" అని చెప్పాడు కళ్యాణ్ రామ్.
అలాగే 'బింబిసార-2'ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో మొదలు పెట్టబోతున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపాడు.
![]() |
![]() |