![]() |
![]() |

తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలకి చెందిన ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న నటీమణి జ్యోతిక.. ప్రముఖ నటుడు సూర్య ని వివాహం చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు నటనకి దూరమైన జ్యోతిక రీసెంట్ గా మళ్ళీ నటించడం ప్రారంభించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథలని మాత్రమే ఎంచుకొని సినిమాలు చేస్తున్న ఆమె . తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి.
యాంకర్ జ్యోతిక తో ఆమె నటిస్తున్న సినిమాల గురించి ప్రస్తావనకు తెచ్చింది. అప్పుడు జ్యోతిక పెద్ద డైరెక్టర్లు ఎవరు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కేవలం ఇప్పడొస్తున్న కొంత మంది యువ దర్శకులు మాత్రమే మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు.అలాగే హీరోలకి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తు వాళ్లని బాగా మోస్తున్నారని నిజానికి హీరోలకంటే హీరోయిన్లే ఎక్కువ శాతం కష్టపడతారని చెప్పింది. ఇప్పుడు జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఎందుకంటే తన ఇంట్లోనే తన భర్త సూర్య మరిది కార్తీ లు హీరోలుగా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు.
![]() |
![]() |