![]() |
![]() |

తెలుగువాళ్ల చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న ముంబైలోని ఓ హోటల్లో కన్నుల పండువగా జరిగిన వేడుకలో తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్‌తో తన లవ్ స్టోరీ గురించి వెల్లడించింది. చాలా కాలం నుంచే తాము ఫ్రెండ్స్ అనీ, అయితే కరోనా మహమ్మారి వల్లే తమ అనుబంధం మరో లెవల్‌కు వచ్చిందని చెప్పింది కాజల్. ఇప్పుడు వారు భార్యాభర్తలుగా కొత్త లైఫ్‌ను మొదలుపెట్టారు.
గౌతమ్‌కు డిజర్న్ లివింగ్ అనే ఫర్నిచర్, డెకరేషన్ ఐటమ్స్ అమ్మే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఉంది. పదేళ్ల క్రితమే కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారు ఒకరికొకరు పరిచయమయ్యారు. "ఏడేళ్లుగా మేం ఫ్రెండ్స్‌మి. మూడేళ్ల నుంచీ డేటింగ్లో ఉన్నాం. ఫ్రెండ్స్ అయిన దగ్గర్నుంచీ ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ వచ్చాం" అని చెప్పింది కాజల్.
సోషల్ పార్టీ అయినా, ముఖ్యమైన ప్రొఫెషనల్ ప్రయత్నమైనా, ఒకరికొకరు తోడుగా ఉంటూ వచ్చారు. "లాక్డౌన్ కారణంగా కొన్ని వారాల పాటు ఒకరినొకరం చూసుకోలేకపోయినప్పుడు మాకు అర్థమైంది, మేం కలిసి ఉండాలని కోరుకుంటున్నామని" అని కాజల్ తెలిపింది. గౌతమ్ సినిమా మనిషి కాకపోవడం మంచిదైందనేది ఆమె అభిప్రాయం. గౌతమ్ నుంచి వచ్చిన హృదయపూర్వక ప్రపోజల్‌కు సరేనంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో కాజల్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడాడు గౌతమ్. జూన్‌లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారి నిశ్చితార్ధం జరిగింది. నిజానికి కిటకిటలాడే డాన్స్ ఫ్లోర్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనేది తన కోరిక అని కాజల్ తెలిపింది. కానీ మహమ్మారి ఆమె కోరికపై నీళ్లు చల్లింది.
"రొమాన్స్ విషయంలో గౌతమ్ కాస్త నెమ్మదిస్తుడే. ఆయన సినిమాలెక్కువగా చూడడు. అంతవరకు నేను హ్యాపీ. ఎందుకంటే సినిమాల్లో నేను చాలా రొమాంటిక్ సీన్లు చేశాను కదా. మా మధ్య సినిమాల్లో చూపించిన తరహాలో ప్రేమ సంభాషణలు జరగలేదు. కానీ హృదయపూర్వకంగా, భావోద్వేగ పూరితంగా మా మధ్య అలాంటి సంభాషణలు జరిగాయి. నాతో భవిష్యత్తు పంచుకోవాలని ఉందని అతను చెప్పిన విధానం నా మనసుకు బాగా హత్తుకుపోయింది." అని చెప్పుకొచ్చింది కాజల్. తన చేతిలోని సినిమాలను పూర్తిచేసి, అప్పుడు హనీమూన్‌కు వెళ్లాలని ఆమె అనుకుంటోంది.
![]() |
![]() |