![]() |
![]() |

అక్కినేని నాగచైతన్యకి కలిసొచ్చిన సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'తడాఖా', 'వెంకీ మామ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీస్ గా నిలిచాయి. ఆ రెండు చిత్రాల నడుమ ఆరేళ్ళ విరామం రాగా.. హ్యాట్రిక్ మూవీ మాత్రం వెంటనే పట్టాలెక్కింది. 'మనం' తరువాత నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో, 'జోష్' తరువాత చైతూ, దిల్ రాజు కాంబోలో రానున్న ఆ సినిమానే 'థాంక్యూ'. ఈ చిత్రానికే తమన్ బాణీలందిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. చైతూతో తమన్ ఇదివరకు జట్టుకట్టిన రెండు సినిమాలు కూడా మల్టిస్టారర్ మూవీస్ కాగా.. ఈ సారి మాత్రం సోలో హీరో సబ్జెక్ట్. మరి.. తొలి రెండు ప్రయత్నాలతో సక్సెస్ చూసిన చైతూ అండ్ తమన్ కాంబినేషన్.. మూడో చిత్రంతోనూ ఆ మ్యాజిక్ ని కొనసాగించి హ్యాట్రిక్ అందుకుంటుందేమో చూడాలి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ క్రేజీ వెంచర్ 2021 సెకండాఫ్‌లో తెరపైకి రానుంది.
![]() |
![]() |