![]() |
![]() |

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయ కేతనం ఎగురవేస్తున్న తార తాప్సీ. 'థప్పడ్', 'మిషన్ మంగళ్', 'బద్‌లా' లాంటి హిట్ సినిమాలతో ఆమె కెరీర్ జోరు మీదుంది. అయితే కెరీర్ మొదట్లో ఆమెను ఐరన్ లెగ్ అన్నవాళ్లున్నారు. ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి నిర్మాతలు వెనుకాడిన రోజులున్నాయి. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ప్రతికూలతలు, పురుషాధిక్యత గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది తాప్సీ.
"కెరీర్ మొదట్లో ఆమె అంత బాగుండదు లాంటి విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నాను. హీరో భార్య వద్దనడంతో ఓ సినిమాలోంచి నన్ను తీసేశారు. ఓ సినిమాలో నేను డబ్బింగ్ చెప్పినప్పుడు హీరోకు అందులో ఓ డైలాగ్ నచ్చలేదు. దాంతో దాన్ని మార్చమన్నారు. నేను నిరాకరించడంతో నాకు తెలీకుండా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను పిలిపించి, ఆ డైలాగ్‌ను వేరేగా చెప్పించారు. ఒకసారైతే నేను ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు, ఆ సినిమా హీరో మునుపటి సినిమా సరిగా ఆడలేదనీ, కాబట్టి బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి కాబట్టి, నా రెమ్యూనరేషన్ తగ్గించుకోమన్నారు. ఇంకో హీరో అయితే సినిమాలో నా ఇంట్రడక్షన్ సీన్ మార్పించమని చెప్పాడు. ఎందుకంటే అతని ఇంట్రడక్షన్ సీన్ కంటే నా ఇంట్రడక్షన్ సీన్ బెటర్‌గా ఉందని. ఇవన్నీ నాకు తెలిసి జరిగిన విషయాలు. నాకు తెలీకుండా నా వెనుక ఏం జరిగాయో నాకు తెలీదు" అని చెప్పుకొచ్చింది తాప్సీ.
కెరీర్ మొదట్లో అని చెప్పింది కాబట్టి.. ఆమె చెప్పిన విషయాల్లో ఎక్కువగా టాలీవుడ్‌కు సంబంధించినవే అని ఊహించుకోవచ్చు. ఇప్పడు తాప్సీ బయటపెట్టిన విషయాలు సదరు హీరోలకు తెలిస్తే ఖంగుతినడం ఖాయం. ఆ హీరోలెవరో తాప్సీ బయటపెడితే బాగుండేది.. అందరికీ వారెవరో కూడా తెలిసేది. ఏ హీరో వైఫ్ వద్దంటే ఆమెను ఏ సినిమాలో తీసేశారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా...
![]() |
![]() |