![]() |
![]() |

ఇప్పుడు సమంత ఒక ఫ్రీ బర్డ్.. ఇదివరకు అక్కినేని వారింటి కోడలు అనే ట్యాగ్ కారణంగా ఉన్న రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు లేవు. తను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుంటూ పోతోంది. తను చెప్పాలనుకున్నది చేసుకుంటూ, తను చేయాలనుకుంటున్నది చేసుకుంటూ, వాటిని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేస్తోంది. అంతే కాదు.. తనకు నచ్చిన క్యారెక్టర్స్‌ను ఎలాంటి సంకోచం లేకుండా ఒప్పుకుంటోంది.
లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. బ్లాక్ కలర్ కాటన్ బ్రా ధరించి, వంపుసొంపులు స్పష్టంగా ప్రదర్శిస్తూ కెమెరాకు పోజులిచ్చింది సమంత. నిన్న షేర్ చేసిన ఒక ఫోటోకు 2 మిలియన్ పైగా లైక్స్ వచ్చాయంటే ఏ రేంజ్‌లో ఆ ఫొటో వైరల్ అయ్యిందో అంచనా వేసుకోవచ్చు.
ఆ ఫొటోకు పలువురు సెలబ్రిటీలు స్పందించారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల అయితే "ఓ మై గాడ్.. వాట్ దిస్ హాట్‌నెస్" అంటూ కామెంట్ సంధించింది. అనుష్క శర్మ "Hottie" అనీ, కాస్ట్యూమ్ డిజైనర్, సమంత ఫ్రెండ్ అయిన నీరజ కోన "వూ మ్యాన్ష అనీ కామెంట్ చేయగా, నటి లక్ష్మీ మంచు "Someone get extinguisher!! Uffff" అని రాసింది. నటి విమలా రామన్ "hottttt" అని కామెంట్ పెట్టింది. సంయుక్తా హెగ్డే, "Someone please call the fire brigade" అనీ, రుహానీ శర్మ "Breath taking" అనీ కామెంట్ చేశారు.
సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఖుషి' అనే సినిమా చేస్తోంది. దీనికి శివ నిర్వాణ దర్శకుడు. 'శాకుంతలం', 'యశోద' సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

![]() |
![]() |