![]() |
![]() |

విడుదల తేదీ మార్చి 25 దగ్గర పడుతుండటంతో దేశవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఖరారైంది. మార్చి 19 న కర్ణాటకలో ఈ వేడుక ఘనంగా జరగనుంది.
కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది జనవరి 7 న రిలీజ్ అవుతుందని భావించారంతా. మూవీ టీమ్ కూడా ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసింది. ముంబై, చెన్నై నగరాల్లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే థర్డ్ వేవ్ కారణంగా మూవీ మార్చి 25 కి వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మళ్ళీ భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా కర్ణాటకలో ఈ నెల 19 న ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. చిక్బల్లాపూర్లో ఈ వేడుక జరగనుందని తెలుపుతూ ఒక పోస్టర్ ని విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ కి రామ్ చరణ్ గన్ షూటింగ్ నేర్పిస్తున్నట్లుగా ఉంది.

అలాగే ఈ నెల 22 లేదా 23 తేదీలలో హైదరాబాద్ లో 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ లుగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ హాజరయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |