![]() |
![]() |

దేశంలోని టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా యస్.యస్. రాజమౌళి పేరు ప్రఖ్యాతులు పొందారు. 'బాహుబలి' సినిమాతో ఆయన ఇమేజ్ ఆకాశాన్ని అంటింది. 'బాహుబలి 2'తో ఇంటర్నేషనల్గానూ ఆయన పేరు మారుమోగి పోయింది. ఇప్పుడాయన 'ఆర్ఆర్ఆర్' మూవీతో మన ముందుకు రాబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు హద్దులు లేవని చెప్పాలి. ప్రపంచమంతా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేశ్‌బాబును డైరెక్ట్ చేస్తానని ఇదివరకే రాజమౌళి ప్రకటించారు. మహేశ్ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్లో 'సర్కారువారి పాట' మూవీని చేస్తున్నాడు. దాని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఇప్పటికే ఆయన కమిట్ అయ్యారు. దాని తర్వాత రాజమౌళి డైరెక్షన్లో ఆయన నటిస్తాడు. దీన్ని బట్టి మహేశ్-రాజమౌళి కాంబినేషన్ సినిమా 2023లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.
మహేశ్ తర్వాత రాజమౌళి ఏ స్టార్‌ను డైరెక్ట్ చేస్తాడనే విషయంపై చాలా రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మహేశ్ తర్వాత అల్లు అర్జున్ను రాజమౌళి డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి బన్నీతో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓసారి చర్చలు జరిపాడని కూడా ప్రచారంలోకి వచ్చింది. అన్నీ కుదిరితే మహేశ్ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ సినిమా పట్టాలెక్కనుంది. అయితే అది జరిగేది 2024లో అనేది ఇన్సైడర్స్ చెప్తున్న మాట. 'పుష్ప' సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కాబట్టి, ఈ కాంబినేషన్ సినిమాకు మరింత క్రేజ్ వస్తుందనేది నిజం.
![]() |
![]() |