![]() |
![]() |

టాలీవుడ్‌లో మరో విషాదం అలముకొంది. సహజనటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య.. సంచలనంగా మారింది. అసలు నితిన్‌కి అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారు? అనే విషయంలో టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. నితిన్ కపూర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, సోదరులతో ఇంట్లో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని, ఆ డిప్రెషన్ భరించలేకే ఆత్మహత్య చేసుకొన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నితిన్ మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా ముంబైలో ఓ మానసిక నిపుణుడి దగ్గర చికిత్స తీసుకొంటున్నారట. అందు కోసమే ఆయన ముంబైలో ఉండిపోయాయని తెలుస్తోంది.
ఇటీవల ఆస్థికి సంబంధించి కొన్ని వివాదాలు మరింత ముదిరాయని, అవి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. గతంలోనూ ఆయన ఇలానే ఆత్మహత్యకు ప్రయత్నించారట. కానీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో ఆయన బయటపడ్డారని, ప్రస్తుతం ముంబైలో ఆయన ఒంటరిగానే ఉంటున్నారని, ఈ పరిస్థితులే ఆయన్ని ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటుందని తెలుస్తోంది. నితిన్ కపూర్ - జయసుధ దాంపత్యంలో ఎలాంటి గొడవలూ లేవని, అయితే... జయసుధతో తెరకెక్కించిన సినిమాల వల్లే నితిన్ కపూర్ ఆర్థికంగా బాగా చితికి పోయారని, హ్యాండ్సప్ అనే సినిమాతో ఆస్తులు అమ్ముకోవాల్సివచ్చిందని తెలుస్తోంది.
![]() |
![]() |