![]() |
![]() |

సినీ పరిశ్రమ రంగుల ప్రపంచం..పైకి వెలుగు జిలుగులతో మాయ చేసినప్పటికీ ఈ రంగంలో ఎన్నో చీకటి కోణాలున్నాయి. అవకాశాలు లేక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చెడ్డ దారులు తొక్కి చివరికి జీవితాలను నాశనం చేసుకున్న ఎంతో మంది గురించి విన్నాం...చూశాం..అయితే ఏకంగా మాఫియాకే బాస్‌గా మారాడు ఓ తెలుగు దర్శకుడు. హైదరాబాద్ కమలాపురి కాలనీలో నివసిస్తున్న దర్శకుడు రామకృష్ణ అలియాస్ కిట్టూ తన కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని పాతనోట్లను మార్పిడి చేసే దందాకు శ్రీకారం చుట్టాడు.
ఈ క్రమంలో హైదరాబాద్, ఏలూరు, ముంబయికి చెందిన కొందరు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు డైరెక్టర్ రామకృష్ణను కలిసి యాభై శాతం కమిషన్‌తో డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఈలోగా విషయం పోలీసుల చెవిన పడటంతో డైరెక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిట్టూ కార్యాలయంపై దాడి చేసి వారి వద్ద నుంచి రూ. 1.2 కోట్ల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం పది మంది వరకు పట్టుబడగా..అసలు సూత్రధారి అయిన కిట్టూ అప్పటికే జారుకున్నాడు..అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, కిట్టూ వ్యవహారం టాలీవుడ్‌లోని చీకటి వ్యవహారాలను మరోసారి బయటపెట్టింది.
![]() |
![]() |