![]() |
![]() |
.jpg)
ఒకప్పుడు తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కనువిందు చేసిన నిన్నటి తరం హీరోయిన్ రాశి పెళ్లైన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. అయితే పెళ్లి తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే "కళ్యాణమే వైభగోమే" సినిమా ద్వారా హీరోయిన్‌కు తల్లిగా ఎంట్రీ ఇచ్చిన రాశి ప్రజంట్ ఓ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. "లంక" అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్‌గా రిలీజైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రెడీ అవుతోన్న ఈ చిత్రంలో రాశి రోల్ చాలా కీలకంగా ఉంటుందట.. అంతేకాదు ప్రజంట్ ట్రండ్‌కి తగ్గట్టు ఆమె పాత్ర డిజైన్ చేశారట. భారీ క్యాస్టింగ్ మరియు టెక్నీషియన్స్‌తో ఈ మూవీని రాశి భర్త శ్రీముని తెరకెక్కిస్తున్నాడట. రిలీజైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అయ్యింది. అతి త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
![]() |
![]() |