![]() |
![]() |

ఆడియో ఫంక్షన్లలో యాంకర్ల ఓవరాక్షన్ భరించలేకపోతున్నారు సినీ జనాలు. సుమ లాంటి సీనియర్లను మినహాయిస్తే. చాలామంది నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొన్ని కొన్ని సార్లు హద్దులు దాటేస్తున్నారు. తాజాగా రోగ్ ఆడియో ఫంక్షన్‌లోనూ ఇదే కనిపించింది. యాంకర్ రవిని తీసుకొచ్చారు ఈ ఆడియో ఈవెంట్‌కి. ఈటీవీలో పటాస్ లాంటి షోలు చేశాక.... మనోడికి పాపులారిటీ కాస్తపెరిగింది. అందులో బూతులు మాట్లాడడం అలవాటు చేసుకొన్నాడు. పైగా ఎదురుగా సన్నీలియోన్ ఉంది.. దాంతో మనోడు కంట్రోల్ తప్పేశాడు.
ఈ ప్రపంచంలో నీ అంత అందగత్తె లేదు అంటూ సన్నీకి కితాబు ఇచ్చాడు. అంతేకాదు.. మోకాలిమీద కూర్చుని.. ఆరాధనగా చూశాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ... మధ్యలో తన అమ్మా,నాన్న ప్రస్తావన తీసుకొచ్చాడు. అమ్మతో నాన్న గొడవ పడినప్పుడల్లా ఓం సన్నీలియోనమః అంటుంటాడట. ఇది మరీ టూమచ్ కదా?? సన్నీ ఓ పోర్న్ స్టార్ అన్న సంగతి అందరికీ తెలుసు. అలాంటి సన్నిని మోసేయడానికి నాన్న పేరుని వాడుకోవడం ఎందుకు?? ఈ కుర్ర చేష్టలు భరించలేక... రవి మరీ టూమచ్ చేశాడంటూ.. ఆడియో ఫంక్షన్‌కి వచ్చినవాళ్లంతా కాస్త చిన్నబుచ్చుకొన్నారు. మరి రవి.. కాస్త కంట్రోల్‌లో ఉండడం మంచిది.
![]() |
![]() |