![]() |
![]() |
.webp)
సినిమాల్లో ఒక్క ఓటుతో గెలిచిన సీన్స్ చాలానే చూస్తుంటాం. ఇళయ దళపతి విజయ్(Vijay)నుంచి వచ్చిన ఒక మూవీ కూడా మనిషి యొక్క ఓటు ఎంత గొప్పదో చెప్పింది. ఇప్పుడు ఆ ఒక్క ఓటుతోనే విజయ్ పార్టీ అభ్యర్థి గెలిచాడనే న్యూస్ ఫ్రెష్ నెస్ హోదాలో తెలుగు సోషల్ మీడియాకి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
శివగంగై జిల్లా తిరుపత్తూర్‌లో టీవీకే అభ్యర్థి శ్రీనివాసకు 83,376 ఓట్లు రాగా డీఎంకే మంత్రి పెరియకరుప్పన్ కి 83,375 ఓట్లు వచ్చాయి. అంటే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి గెలిచాడు. మస్కట్ నుంచి వచ్చిన విజయ్ అభిమాని ఓటేయడంతో అతను వేసిన ఆ ఒక్క ఓటు టీవీకే అభ్యర్థిని గెలిపించినట్లయింది. అంటే ఎవరకి వారు నా ఒక్క ఓటే అనుకోవచ్చు. కానీ మస్కట్ నుంచి ప్రత్యేకంగా ఓటు వేయడానికి అభిమాని రావడంతో గెలుపు క్రెడిట్ అతనికి ఇవ్వచ్చు. దీంతో మస్కట్ అభిమాని అయిన మణికందన్ తనకు గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Also read: VIjay: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్ బీ చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన సూపర్ హిట్స్ ఇవే
![]() |
![]() |