![]() |
![]() |

టాలీవుడ్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సినిమాల్లో '100% లవ్' (100% Love) ఒకటి. అక్కినేని నాగచైతన్య, తమన్నా భాటియా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితో 15 ఏళ్లను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. "మనల్ని నవ్వించి, పులకింపజేసి, ప్రేమలో పడేలా చేసిన చిత్రం" అంటూ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను అభివర్ణించింది.
https://x.com/GeethaArts/status/2051916822182797443
2011లో విడుదలైన '100% లవ్' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా, అప్పట్లో యువతకు ఒక కొత్త ఫీలింగ్ ను ఇచ్చింది. బాలుగా నాగచైతన్య, మహాలక్ష్మిగా తమన్నా మధ్య సాగే ఈగో క్లాషెస్, స్వీట్ మెమరీస్ ఇప్పటికీ ప్రేక్షకులకు తాజాగానే అనిపిస్తాయి. సుకుమార్ మార్క్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి.
ఈ మైలురాయి సందర్భంగా హీరో నాగచైతన్య కూడా స్పందించారు. అద్భుతమైన ఈ మూవీ టీమ్ కు, ప్రేక్షకులు అందించిన ప్రేమకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. "15 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిన అందరికీ థాంక్స్" అంటూ ట్వీట్ చేశారు.
https://x.com/chay_akkineni/status/2051924875942469826
![]() |
![]() |