![]() |
![]() |

ది కేరళ స్టోరీ(The kerala Story)సిరీస్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. చివరకి సినిమానే గెలవాలి కాబట్టి ఎట్టకేలకు రెండు పార్టులు థియేటర్స్ లో అడుగుపెట్టాయి. మొదటి భాగం 2023 రిలీజ్ అవ్వగా రెండవ భాగం మొన్న ఫిబ్రవరి 27న విడుదలైంది. ఇప్పుడు సినీ, అండ్ కేరళ స్టోరీ అభిమానులకి గుడ్ న్యూస్. ఓటిటి వేదికగా పార్ట్ 2 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. డీటెయిల్స్ చూద్దాం.
ZEE5 వేదికగా మే 8,నుండి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 10 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం. సాధారణంగా పెద్ద సినిమాలు 8 వారాల విరామం తర్వాత వస్తుంటాయి, కానీ ఈ సినిమా విషయంలో మేకర్స్ కొంత ఎక్కువ సమయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి ఓటిటిలోకి కూడా రావడానికి ప్రసవ వేదన అనుభవించిందని అర్ధమవుతుంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనపడగా ముగ్గురు హిందూ యువతులు, కొంత మంది ముస్లిమ్ యువకుల చేతుల్లో ఎలా మోసపోయారు. ఆ తర్వాత వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులు ఏమిటి అనేదే పాయింట్. అక్రమ సంబంధాల ద్వారా యువతులను ట్రాప్ చేసే అంశాలని కూడా చర్చించింది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించాడు.
also read: Dhurandhar: తమ నటుడుకి కోటి రూపాయలు అదనంగా ఇచ్చిన ధురంధర్ టీం.. ఎవరో ఊహించారా
వివాదాస్పద అంశాలతో కూడిన సినిమాలు ఓటీటీలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. మరి 'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌పై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. కేవలం హిందీలోనే కాకుండా అన్ని లాంగ్వేజ్ ల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
![]() |
![]() |