![]() |
![]() |
సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్‌లకు ఏమాత్రం విరామం దొరికినా, తన భార్య నమ్రత, పిల్లలతో కలిసి విదేశీ విహార యాత్రలకు చెక్కేయడం ఆయనకు అలవాటు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే మహేష్ బాబు ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. అయితే, తాజాగా మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ, ఈసారి ఆయన వెళ్లిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సాధారణంగా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లే పర్యటనలకు భిన్నంగా, ఈసారి మహేష్ బాబు ఎయిర్‌పోర్ట్‌లో ఒంటరిగా కనిపించారు. నమ్రత స్వయంగా కారులో వచ్చి మహేష్‌ను ఎయిర్‌పోర్ట్ వద్ద డ్రాప్ చేసి వెనక్కి వెళ్లిపోయారు. మహేష్ ఒక్కడే విదేశాలకు వెళ్లడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే అనుమానాలు అటు అభిమానుల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ మొదలయ్యాయి. ఇది కేవలం పర్సనల్ ట్రిప్ మాత్రమేనా లేక తన తదుపరి భారీ చిత్రం కోసం చేస్తున్న కసరత్తా? అన్న చర్చ జోరుగా సాగింది.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మహేష్ బాబు ఈ పర్యటనకు వెళ్లింది ఎంజాయ్ చేయడానికి కాదు, తన రాబోయే సినిమా 'వారణాసి' (SSMB29) పనుల కోసం అని తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవికి విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం రాజమౌళి అంటార్కిటికా వంటి కఠినమైన ప్రదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. ఆ భారీ షెడ్యూల్ ప్రారంభం కావడానికి ముందే, ఆ వాతావరణానికి అలవాటు పడటానికి లేదా చిత్రానికి సంబంధించిన సాంకేతికపరమైన ప్రిపరేషన్ కోసం మహేష్ ఈ సోలో ట్రిప్ వేసినట్లు సమాచారం. గ్లోబల్ అడ్వెంచర్ మూవీ కావడంతో హాలీవుడ్ టెక్నీషియన్లతో చర్చలు లేదా ఫిజికల్ ట్రైనింగ్‌లో భాగంగానే ఈ పర్యటన సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
![]() |
![]() |