![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 'ఠాగూర్' (Tagore) ఒకటి. అవినీతిపై యుద్ధం ప్రకటించిన ఒక ప్రొఫెసర్ కథగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే వాస్తవానికి ఈ సినిమా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) చేయాల్సింది. కానీ, చిరంజీవి దగ్గరకు వెళ్ళింది. తాజాగా ఈ విషయంపై రాజశేఖర్ స్పందించారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అడ్వాన్స్ ఇచ్చాను కానీ..
తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా వచ్చిన 'రమణ' సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. ఆ సినిమా చూసిన రాజశేఖర్, దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావించి వెంటనే అడ్వాన్స్ కూడా చెల్లించారట. "నేను ఆ సినిమా హక్కుల కోసం అడ్వాన్స్ ఇచ్చాను. కానీ అక్కడ ఉన్న వారు నా స్నేహితులే కదా అని ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. అదే నేను చేసిన పెద్ద తప్పు" అని రాజశేఖర్ పేర్కొన్నారు.
ఠాగూర్ మధు ఎంట్రీ..
రాజశేఖర్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నప్పటికీ, తర్వాత నిర్మాత ఠాగూర్ మధు రంగంలోకి దిగి భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో 'రమణ' రీమేక్ హక్కులు ఆయన సొంతమయ్యాయి. రాజశేఖర్ స్నేహితులను నమ్మి అగ్రిమెంట్ చేసుకోలేదు. కానీ, వారు మాత్రం ఎక్కువ డబ్బుకి ఆశపడి రీమేక్ రైట్స్ మరొకరికి ఇచ్చేశారు. అలా చిరంజీవి హీరోగా, వి.వి. వినాయక్ దర్శకత్వంలో 'ఠాగూర్' సినిమా పట్టాలెక్కింది.
ఏది ఏమైనా 'ఠాగూర్' సినిమా చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అదే రాజశేఖర్ చేసి ఉంటే ఆ సినిమా ఫలితం ఎలా ఉండేదో అని ఇప్పటికీ ఆయన అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
![]() |
![]() |