![]() |
![]() |

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాగార్జున కి ఓం నమో వెంకటేశాయ రూపంలో చేదు అనుభవం ఎదురయింది. పెట్టిన పెట్టుబడికి వసూలు చేసిన కలెక్షన్స్ కి అంతరం చాల ఎక్కువ ఉండడంతో నిర్మాతలకి, పంపిణీదారులకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక నుండి చేసే సినిమాలు చాలా జాగ్రత్తగా చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నాడట.
ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో ఒక హారర్ సినిమా రాజుగారి గది 2 చేస్తున్న నాగార్జున, ఒక ప్రధాన పాత్ర కోసం తన కాబోయే కోడలు సమంతని తీసుకున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే విడుదల చేసేలా సన్నద్ధాలు చేస్తున్నారు.
అసలు విషయానికి వస్తే, నాగార్జున కి ఏదో విషయం నచ్చక సెట్ లో రచ్చ రచ్చ చేసాడంట. డైరెక్టర్ ఓంకార్ ని అయితే, అందరూ చూస్తుండగానే తిట్టేసాడంట. తన కోపం మొత్తం పోయేవరకు ఊగి పోయాడంట అందరి పైన. చివరికి, తనని తాను సమాధాన పరుచుకొని ఇంకో సారి తప్పులు జరగకుండా చూసుకోవాలని చెప్పాడంట.
చూస్తుంటే నాగార్జునకి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. ఈ మధ్య అన్ని చేదు వార్తలే- పర్సనల్ గా ప్రొఫెషనల్ గా.
![]() |
![]() |