![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ తన 101 వ చిత్రం కోసం దర్శకుడు పూరి జగన్నాధ్ తో చేయనున్న విషయం మనందరికీ విదితమే. పూరి కొన్ని రోజుల క్రితం కొందరు కొత్త నటులకి అవకాశం ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బాలకృష్ణకి విలన్ గా మాత్రం మరొక తెలుగు నటుడిని తీసుకుంటున్నారట. అతను మరెవరో కాదు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు. భాగీ అనే బాలీవుడ్ చిత్రం లో విలన్ గా ఫుల్ మార్కులు తెచ్చుకున్న సుధీర్, బాలకృష్ణతో ఢీ కొట్టడానికి అంగీకారం తెలిపాడట. ఇది నిజమే అయితే, తెలుగు ఇండస్ట్రీ కి మరో కొత్త విలన్ దొరికాడన్నమాటే. మాస్ ప్రేక్షకులకి మాత్రం పండగే అని చెప్పొచ్చు.
తన స్నేహితుడు పుల్లెల గోపీచంద్ నిజజీవితం ఆధారంగా సినిమా తీద్దామని ప్రయత్నాలు చేసిన సుధీర్, గత కొంత కాలంగా ఏ సినిమాని అంగీకరించ లేదు. అయితే, పూరి కలిసి కథ చెప్పినప్పుడు, వెంటనే ఓకే చేసాడంట. భాగీలో తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన సుధీర్, సరి కొత్త అవతారంలో కనిపిస్తాడని వినికిడి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబడనున్న ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్, మరియు ఇతర నటీనటులు ఖరారు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 29 న విడుదల చేస్తానని పూరి ఇంతకు ముందే ప్రకటించారు.
![]() |
![]() |