![]() |
![]() |

చిరంజీవి లెగస్సీని కంటిన్యూ చేస్తూ విజయాలు అందుకొన్నాడు పవన్ కల్యాణ్. పవన్‌కి ఇంత ఇమేజ్, ఇంత క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం... చిరునే. మెగా అభిమానులంతా పవన్‌ని ఆదరించారు కాబట్టే... టాలీవుడ్ లో నెం.1 స్థానాన్ని ఎగబాకాడు. ఆ తరవాతర్వాత తనకంటూ ఓ అభిమానగణాన్ని సంపాదించుకోవడం, తనకంటూ ఓ స్టైల్ సంపాదించుకోవడంతో పవన్ నిలబడిపోయాడు. అయితే... ఇప్పుడు అన్ని విషయాల్లోనూ చిరుని దాటేయడం, చిరు రికార్డుల్ని బ్రేక్ చేయడం ఓ అలవాటుగా చేసుకోవడం పవన్ స్టామినాకు అద్దం పడుతుంది. కాటమరాయుడు శాటిలైట్ హక్కుల రూపంలో మరోసారి చిరు రికార్డ్ బ్రేక్ చేశాడు పవన్. కాటమరాయుడు సినిమా హక్కుల్ని జెమినీ రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసింది. సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అయినా.. కాటమరాయుడు ఓ రీమేక్ సినిమా అయినా సరే.. ఈ స్థాయిలో శాటిలైట్ హక్కులు అమ్ముడు పోవడం వింతగానే ఉంది మరి. అయితే అదే సమయంలో ఖైదీ నెం.150 రికార్డుని కాటమరాయుడు బ్రేక్ చేసింది. చిరు సినిమాకి శాటిలైట్ రూపంలో వచ్చింది రూ.12 కోట్లే. అంటే.. బుల్లి తెరపైనా చిరుపై పవన్ సంపూర్ణ ఆధిపత్యం చూపిస్తున్నాడన్నమాట.
![]() |
![]() |