![]() |
![]() |

బాహుబలి 2 ట్రైలర్ వచ్చేస్తోంది. ఈనెల 16న థియేటరికల్ ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఆ రోజు సరిగ్గా ఉదయం 9 గంటలకు ట్రైలర్ బయటకు వచ్చేస్తుంది. అయితే ముందుగా ఈ ట్రైలర్‌ని థియేటర్లలో చూపిస్తారట. ఆ సాయింత్రానికి యూ ట్యూబ్‌లో పెట్టేస్తారు. ఆడియన్స్‌కి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం ఇప్పటికే రెండు ట్రైలర్లు కట్ చేశార్ట. అందులో ఏది ఫైనల్ చేయాలన్న విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలలో థియేటర్ల లిస్టు ఫైనల్ చేస్తోంది చిత్రబృందం. ఎంపిక చేయబడిన థియేటర్లలో మార్చి 16న ట్రైలర్‌ని ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 విడుదల కాబోతోంది.
![]() |
![]() |