![]() |
![]() |

మిచెల్ యోహ్ చూ-ఖెంగ్ ( 6 ఆగష్టు 1962)
అందం, నృత్యంలో ప్రవేశం, మార్షల్ ఆర్ట్స్ పై మక్కువ ఆమెను జేమ్స్ బాండ్ చిత్రాల్లో హీరోయిన్ గా చేశాయి. 1983లో క్వీన్ ఆఫ్ పసిఫిక్ అందాల పోటీలోనూ, మిస్ మలేషియాగానూ ఎంపికైంది. ఆ తర్వాత హాంగ్ కాంగ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి జేమ్స్ బాండ్ చిత్రం టుమారో నెవర్ డైస్ లో నటించి యాక్షన్ హీరోయిన్ గా పేరుప్రతిష్టలు సాధించారు. అంతేకాదు ఆల్ టైం స్క్రీన్ బ్యూటీస్ లో ఆసియా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బర్మాదేశ రాజకీయ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ బయోపిక్ "ది లేడీ" చిత్రంలో ఆంగ్ సాన్ సూకీ పాత్ర షోషించినందుకు బర్మా ప్రభుత్వం చేత బ్లాక్ లిస్ట్ లో చేరారు. ఆమె ప్రముఖ నటి మిచెల్ యోహ్ చూ-ఖెంగ్. మూడు దశాబ్దాలుగా యాక్షన్, కామెడీ, రొమాంటీక్ పాత్రల్లో అంతర్జాతీయ ఆంగ్ల చిత్రాల్లో, వెబ్ సిరీస్‌లో నటిస్తూ ప్రేక్షకుల చేత ప్రేమగా మిచెల్ ఖాన్ గా పిలిపించుకుంటున్నారు.
మలేషియాలోని ఓపోలో జన్మించిన మిచెల్ చిన్నతనంలోనే డాన్స్ పై ఆసక్తి ఉండేది. నాలుగేళ్ల వయసులో బ్యాలెట్ ప్రారంభించిన ఆమె ఆల్-గర్ల్స్ సెకండరీ పాఠశాల మెయిన్ కాన్వెంట్ లో చదువుకున్నారు. 15 సంవత్సరాల వయసులో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లారు. అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డాన్స్ లో చదువుకున్నారు. బ్యాలెట్ ప్రదర్శనలు ఇచ్చేవారు. అయితే ప్రమాదం కారణంగా వెన్నెముకకు అయిన గాయం ప్రొఫెషనల్ బ్యాలెట్ డాన్సర్ కావాలన్న ఆమె ఆసక్తిని అడ్డుకుంది. ఆ తర్వాత ఆమె తన దృష్టిని కొరియోగ్రఫీ, ఇతర కళల వైపు మళ్లించారు. 1983 లో 20 ఏళ్ళ వయసులో మిస్ మలేషియా పోటీలో విజేతగా నిలిచారు. హాంకాంగ్ యాక్షన్ చిత్రాల్లో ఎస్ మేడం (1985), పోలీస్ స్టోరీ 3: సూపర్ కాప్ (1992), హోలీ వెపన్ (1993). క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ తదితర సినిమాల్లో నటనకు ఆమె ఉత్తమ నటిగా బాఫ్టా అవార్డుకు ఎంపికైయ్యారు. ఆ తర్వాత చాలా ఇంగ్లీష్, మాండరిన్, కాంటోనీస్ భాషా చిత్రాలలో నటించారు. ది లేడీ (2011) ఆంగ్ సాన్ సూకీ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా. ఇందులో ఆంగ్ సాన్ సూకీగా నటించినందుకు ఆమెను బర్మా ప్రభుత్వం హిట్ లిస్ట్ లో చేర్చింది.
అనేక యాక్షన్ సినిమాల్లో నటించడంతో పాటు తన సొంత నిర్మాణ సంస్థ మిథికల్ ఫిల్మ్స్ ద్వారా 2002లో తన మొదటి ఆంగ్ల చిత్రం " ది టచ్ " నిర్మించారు. అనేక యాక్షన్ తో పాటు డ్రామా, ఫాంటసీ సినిమాల్లో తన అద్భుతమైన నటన ద్వరా హాలీవుడు ప్రేక్షకులను అలరించారు. ప్రపంచంలోని అందమైన 50 వ్యక్తుల్లో ఒకరుగా, ఆల్ టైమ్ స్క్రీన్ బ్యూటీస్ 35లో ఒకరుగా ఎంపికైన ఆమె వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎన్నో అవార్డులను తన సొంతం చేసుకున్నారు.
2011 లో, 24 వ మలేషియా ఫిల్మ్ ఫెస్టివల్ (FFM 24) లో మలేషియా సినిమా రంగానికి ఆమె చేసిన కృషికి ప్రత్యేక అవార్డు లో సత్కరించారు. మార్చి 2013 లో హాంకాంగ్‌లో జరిగిన 7 వ ఆసియా ఫిల్మ్ అవార్డుల సందర్భంగా ఎక్సలెన్స్ ఇన్ ఏషియన్ సినిమా అవార్డును అందుకున్నారు. 30 నవంబర్ 2013 న, అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా అధ్యక్షత వహించారు. ఫిబ్రవరి 2016 న కౌలాలంపూర్‌లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆమెకు అవార్డును ప్రదానం చేసింది.
![]() |
![]() |