![]() |
![]() |
.jpg)
యువ సామ్రాట్ నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న `లాల్ సింగ్ ఛద్దా`తో చైతూ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారన్నదే ఆ కథనాల సారాంశం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చైతూ బాలీవుడ్ ఎంట్రీ వార్తలు నిజమేనని తెలిసింది. అంతేకాదు.. ఈ కామిక్ ఎంటర్ టైనర్ లో నాగచైతన్య `గ్రే షేడ్స్` ఉన్న పాత్రలో కనిపిస్తారట. ఇదివరకు ఈ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంచుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
కాగా, ప్రస్తుతం ఆమిర్ కోవిడ్ క్వారంటైన్ లో ఉన్నారు. తను కోలుకున్నాక ప్రారంభమయ్యే షెడ్యూల్ లో చైతూ కూడా జాయిన్ అయ్యే అవకాశముందంటున్నారు. `లాల్ సింగ్ ఛద్దా`లో కరీనా కపూర్ నాయికగా నటిస్తుండగా.. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ భారీ బడ్జెట్ మూవీ తెరపైకి రానుంది. మరి.. చైతూ బాలీవుడ్ డెబ్యూ మూవీ తనకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. చైతూ తాజా చిత్రం `లవ్ స్టోరి` ఏప్రిల్ 16న రిలీజ్ కానుంది. అలాగే విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో చేస్తున్న `థాంక్ యూ` కూడా ఇదే క్యాలెండర్ ఇయర్ లో రిలీజ్ కానుంది.
![]() |
![]() |