![]() |
![]() |

ద్విశతాధిక చిత్రాల స్వరకర్త కీరవాణి తనయుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. గాయకుడిగానూ, సంగీత దర్శకుడిగానూ తనదైన ముద్ర వేస్తున్నారు కాలభైరవ. `మత్తు వదలరా`, `కలర్ ఫొటో` చిత్రాలతో కంపోజర్ గా సంగీత ప్రియులను మురిపించిన కాలభైరవ.. శనివారం థియేటర్స్ లోకి రానున్న `తెల్లవారితే గురువారం`తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న యువ సంగీత దర్శకుల్లో ఒకడిగా కాలభైరవ వార్తల్లో నిలుస్తున్నారు. నాగశౌర్య కథానాయకుడిగా రూపొందుతున్న `లక్ష్య`తో పాటు సత్యదేవ్ - తమన్నా జంటగా నటిస్తున్న `గుర్తుందా శీతాకాలం`, నిఖిల్ - చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న `కార్తికేయ 2`కి కాలభైరవనే బాణీలు అందిస్తున్నారు. అంతేకాదు.. చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న వెబ్ సిరీస్ తో పాటు తన తమ్ముడు సింహా కాంబినేషన్ లో `మత్తు వదలరా`, `తెల్లవారితే గురువారం` తరువాత రానున్న థర్డ్ జాయింట్ వెంచర్ కీ కాలభైరవే స్వరాలందిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉండడం విశేషం.
మొత్తమ్మీద.. టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కాలభైరవని చెప్పుకోవచ్చు. మరి.. రాబోయే చిత్రాలతో కాలభైరవ స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.
![]() |
![]() |