![]() |
![]() |

2019 సంక్రాంతికి సంచలనం సృష్టించిన చిత్రం `ఎఫ్ 2`. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోడల్లుళ్ళుగా నటించిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ కి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ఎఫ్ 2` కెప్టెన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `దిల్` రాజు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. `ఎఫ్ 2`లో వెంకీ, వరుణ్ కి జంటగా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్.. `ఎఫ్ 3`లోనూ నాయికలుగా కొనసాగుతున్నారు. అంతేకాదు.. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా మెరవనుందని సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. `లెజెండ్`, `డిక్టేటర్`, `రూలర్` చిత్రాల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన కనువిందు చేసిన సోనాల్ చౌహాన్. కథను కీలక మలుపు తిప్పే అతిథి పాత్రలో సోనాల్ కనిపిస్తుందట. తన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని బజ్. త్వరలోనే `ఎఫ్ 3`లో సోనాల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ఆగస్టు 27న `ఎఫ్ 3` ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |