![]() |
![]() |

సన్నజాజిలా మారిన బొండుమల్లిని ఎక్కడైనా చూశారా? చూడకపొతే ఒక్కసారి లేడీ కమెడియన్ విద్యుల్లేఖను చూడండి. చక్కనమ్మ చిక్కినా అందమే అనేది అప్పుడప్పుడూ వింటుంటాం కదా! అందుకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ విద్యులేఖ. ఈ బొద్దుగుమ్మ బాగా బక్కచిక్కారు. సారీ... సారీ... బాగా బరువు తగ్గి సన్నజాజిలా మారారు. కావాలంటే ఫొటోలు చూడండి. ఎల్లో డ్రస్‌లో ఫొటో ఎప్పుడో తీసుకున్నది. బ్లాక్ డ్రస్‌లో ఫొటో లేటెస్ట్‌గా రెండు రోజుల క్రితం తీసుకున్నది.

టెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు 68 కేజీలు ఉన్నాననీ, మళ్లీ ఇన్నాళ్ళకు 65 కేజీలకు వచ్చానని విద్యుల్లేఖ తెలిపింది. ఏడాదిగా వెయిట్ తగ్గడం కోసం ఆమె తీవ్రంగా కృషి చేస్తోంది. నాగచైతన్య ‘సవ్యసాచి’లో నటించినప్పటికీ, ‘వెంకీమామ’లో నటించినప్పటికీ 15 కేజీలు తగ్గానని గతంలో తెలిపింది. ఇప్పుడు మరోసారి చాలా బరువు తగ్గినట్టు చెప్పింది. అయితే, తన హయ్యెస్ట్ వెయిట్ ఎంతనేది ఎప్పుడూ చెప్పలేదు. వెయిట్ లాస్‌కి సీక్రెట్స్ మందులు, బిళ్లలు లేవనీ... వారంలో ఆరు రోజులు వర్కవుట్లు చేస్తూ డైట్ మెంటైన్ చేయడమేనని విద్యుల్లేఖ స్పష్టం చేసింది. సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్ హీరోయిన్ కాకముందు వెయిట్ ఎక్కువ ఉండేది. హీరోయిన్ కావడం కోసం చాలా తగ్గింది. సౌత్‌లో ఆ రేంజ్‌లో వెయిట్ తగ్గిన యాకె్ట్రస్ విద్యుల్లేఖ అనవచ్చు.
![]() |
![]() |