![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ బాబీపై ప్రశంసల వర్షం కురిపించారు.
"నా అభిమాని అని బాబీకి ఈ అవకాశం ఇవ్వలేదు. అతని అద్భుతమైన టాలెంట్ ని చూసి ఈ అవకాశమిచ్చాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. సినిమాని అద్భుతంగా రూపొందించాడు. ఇది కమర్షియల్ సినిమానే.. కానీ కొత్తగా ఉంటుంది. క్లాస్, మాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ కలగలిసిన ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సినిమా. ఇదిరా సినిమా అంటే.. ఇలాంటి సినిమా కోసం కదా మనం ఎదురుచూస్తున్నది.. ఇలాంటి కమర్షియల్ సినిమా వచ్చి ఎంత కాలమైంది అని ప్రతి ఒక్కరి చేత అనిపించేలా తీశాడు బాబీ. ఏవైనా సూచనలు చెప్పినా.. వీళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసా అని ఇగోకి పోకుండా.. సినిమా కోసం ఎంతో ఆలోచించి, వెంటనే కసితో మార్పులు చేసి ఊహించిన దానికంటే మంచి అవుట్ పుట్ ఇస్తాడు. బాబీ వర్క్, డెడికేషన్ చూసి నేనే అతనికి ఫ్యాన్ అయిపోయాను. సినిమాలో మొదటి 25 నిమిషాల్లోనే హాలీవుడ్ స్థాయిలో రెండు ఎపిసోడ్లు తెరకెక్కించాడు" అంటూ దర్శకుడు బాబీపై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు.
![]() |
![]() |