![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో భీమ్ పాత్రలో ఆయన నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. తాజాగా రాజమౌళి సైతం ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశాడు. ఎన్టీఆర్ కనుబొమ్మలతో కూడా నటించగలడు అంటూ ప్రశంసించాడు.
'ఆర్ఆర్ఆర్'ని ఆస్కార్ రేసులో నిలిపేందుకు మూవీ టీమ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని డీజీఏ థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్ కి రాజమౌళి, ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కొమురం భీముడో సాంగ్ తన ఆల్ టైమ్ ఫేవరేట్ అని, అందులో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని అన్నాడు. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడని, కెమెరాను అతని కనుబొమ్మల దగ్గర పెడితే వాటితోను హావభావాలను పలికించగలడని రాజమౌళి ప్రశంసించాడు.
![]() |
![]() |