![]() |
![]() |

ఈ సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాలు సందడి చేయనున్నాయి. 'వాల్తేరు వీరయ్య'కి బాబీ కొల్లి దర్శకత్వం వహించగా.. 'వీరసింహారెడ్డి'కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాల ట్రైలర్లు తాజాగా విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతికి మాస్ ఫీస్ట్ గ్యారెంటీ అని ఇరు హీరోల ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ లో గోపీచంద్ మలినేని సినిమాలోని ఓ డైలాగ్ ఉండటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా విడుదలైన 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వింటేజ్ మెగాస్టార్ ని వెండితెరపై చూడబోతున్నామంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ట్రైలర్ లో "రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి" అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నిమిషాల్లోనే ఈ డైలాగ్ ట్రెండింగ్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ డైలాగ్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ డైలాగ్ గతంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'విన్నర్' సినిమాలోది కావడం విశేషం. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కమెడియన్ పృథ్వీరాజ్ 'సింగం సుజాత' అనే పోలీస్ రోల్ పోషించాడు. అందులో ఆయన ఒక సన్నివేశంలో "రికార్డ్స్ లో నా పేరు ఉండటమేంట్రా.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి" అని చెప్తాడు. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ లోని డైలాగ్ కూడా దాదాపు ఒకటే కావడంతో.. 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ లో గోపీచంద్ మలినేని డైలాగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి.
![]() |
![]() |