![]() |
![]() |

మిల్కీ బ్యూటీ తమన్నా 'మాస్టర్ చెఫ్ తెలుగు' షోతో బుల్లితెర హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోకి ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడంలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా ఈ షో హోస్ట్ గా తమన్నాను తప్పించి అనసూయను తీసుకొచ్చారు నిర్వాహకులు. తనను హోస్ట్ గా తప్పించి షాక్ ఇచ్చిన షో నిర్వాహకులకు తమన్నా కూడా ఓ షాక్ ఇచ్చింది. తన రెమ్యునరేషన్ మొత్తం చెల్లించలేదని, తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని లీగల్ నోటీసులు పంపించింది.
రెమ్యునరేషన్ విషయంలో తమన్నా చేసిన ఆరోపణలపై షో ప్రొడక్షన్ హౌజ్ 'ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ' స్పందించింది. తమన్నా చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలుపుతూ నిర్వాహకులు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేలా తమన్నాతో అగ్రిమెంట్ చేసుకున్నామని, జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షూట్ లో పాల్గొనేలా ఆమె అగ్రిమెంట్ పై సంతకం చేశారని తెలిపారు. అయితే ఆమె ఇతర కమిట్ మెంట్ల వల్ల కేవలం 16 రోజులు మాత్రమే షూటింగ్ కు వచ్చారని.. ఆమె రెండు రోజులు ఆమె షూటింగ్ కు రాకపోవడం వల్ల... 300 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్న తమకు రూ.5 కోట్లకు పైగా నష్టం వచ్చిందని పేర్కొన్నారు. తమన్నాకు ఇప్పటికే రూ.1.56 కోట్ల పేమెంట్ చేశామని.. ఆ రెండు రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసి ఉంటే మిగిలిన పేమెంట్ కూడా చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ విషయంలో లీగల్ గా ముందుకు వెళ్తామని నిర్వాహకులు అన్నారు.

'మాస్టర్ చెఫ్' షో నిర్వాహకుల ప్రెస్ నోట్ పై తమన్నా ఎలా స్పందిస్తుందో.. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
![]() |
![]() |