![]() |
![]() |

`ఆర్ ఆర్ ఆర్`తో తొలిసారిగా హిస్టారికల్ ఫిక్షన్ బాట పట్టారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ పిరియడ్ డ్రామాలో చారిత్రక పురుషుడు కొమురం భీమ్ గా దర్శనమివ్వనున్నారు తారక్. కట్ చేస్తే.. త్వరలో ఈ టాలెంటెడ్ స్టార్ మరోమారు చారిత్రక నేపథ్యమున్న సినిమాలో నటించబోతున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఆర్ ఆర్ ఆర్`తో పాన్ - ఇండియా స్టార్ గా అవతరించనున్న జూనియర్ ఎన్టీఆర్.. ఆపై విజనరీ డైరెక్టర్ కొరటాల శివతోనూ, `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లోనూ ఇదే తరహా పాన్ - ఇండియా శైలి చిత్రాలతో సందడి చేయనున్నారు. అంతేకాదు.. తాజాగా మరో పాన్ - ఇండియా మూవీకి కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని హిస్టారికల్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తారని వినికిడి. అలాగే, చారిత్రక నేపథ్యంలో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎన్టీఆర్ కనిపిస్తారని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |