![]() |
![]() |

తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై సమంత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సమంతకు భారీ ఊరట లభించింది.
నాగ చైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత సమంతని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెపై రకరకాల కామెంట్స్ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఈ క్రమంలో తన పరువుకి భంగం వాటిల్లిందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై సమంత హైదరాబాద్‌లోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్ లో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసుపై కోర్టులో వాదనలు జరగ్గా.. సమంతకు ఊరట కలిగేలా కోర్టు తీర్పు వెల్లడించింది.
సమంత వ్యక్తిగత వివరాలను ఎవరూ ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్ ఛానెల్స్ వెంటనే అలాంటి కంటెంట్ ని తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్ ని కూడా తొలగించాలని హితవు పలికింది. ఆమె ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారం చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
![]() |
![]() |