![]() |
![]() |

టాలీవుడ్‌లోని టాలెంటెడ్ సింగర్స్‌లో లిప్సిక ఒకరు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డిస్కవరీ అయిన లిప్సిక 'పాడుతా తీయగా' ద్వారా వెలుగులోకి వచ్చి, స్వల్ప కాలంలోనే ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. వారం రోజులుగా తన చర్మం తన మాట వినకుండా సతాయిస్తోందనీ, అలా ఎందుకయ్యిందో కూడా తనకు తెలుసనీ అంటోంది. తనకు బ్యాడ్ స్కిన్ డేగా తేల్చేసింది. లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆమె, మంచి చర్మం కోసం ఏమేం పనులు చేయాలో రాసుకొచ్చింది.
"గత వారం రోజుల నుంచీ నా స్కిన్ నన్ను చాలా సతాయిస్తోంది. ముఖంపై మచ్చలు, మొటిమలు వచ్చి చాలా సతాయిస్తోంది. ఎందుకో కూడా నాకు తెలుసు. తగిన మోతాదులో వాటర్ తాగట్లేదు. మంచి ఆహారం తీసుకోవట్లేదు. పనుల మీద బయట తిరుగుతుండటం వల్ల బయటి ఆహారం తినాల్సి వస్తోంది. సరైన నిద్ర ఉండట్లేదు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల నా స్కిన్ ఇలా తయారయ్యిందనే విషయం నాకు తెలుసు. ఎప్పుడూ ఫొటోస్ పెట్టి గుడ్ స్కిన్ డే, గ్రేట్ స్కిన్ డే.. ఓ మైగాడ్ అని కథలు పడుతుంటాం కదా. స్కిన్ ఇలా అయినప్పుడు కూడా వీడియో పెట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకుందామనుకున్నా. ఎంత గొప్ప స్కిన్ ఉన్నా కూడా ఏదో ఒక టైమ్‌లో కచ్చితంగా వాళ్లకు ఇలాంటి ఫేస్ ఒకటి వస్తుంది. డెఫినెట్‌గా పోతుంది కూడా. కానీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. స్కిన్‌ను ఎలా ట్రీట్ చేస్తే అలా చూపిస్తుంటుంది. వారం క్రితంతో పోలిస్తే ఇప్పుడు నా స్కిన్ కొంత బెటర్ అయ్యింది. దట్స్ ఇట్. బ్యాడ్ స్కిన్ డే గైస్.. సీరియస్‌లీ." అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది లిప్సిక.
ఆ వీడియోతో పాటు, "మంచినీరు తాగండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, మాస్క్‌లు క్లీన్ చేసుకోండి, కొన్ని నిమిషాల సేపైనా ఒంటికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి, సరిగా నిద్రపోండి.. ఈ ఐదూ చేస్తే డెఫినెట్‌గా చర్మం బాగా అవుతుంది. నా చర్మం కూడా బాగవుతోంది." అని రాసుకొచ్చింది.
![]() |
![]() |