![]() |
![]() |

'కేజీఎఫ్ ఛాప్టర్ 2'.. నేషనల్ వైడ్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్. 2018 డిసెంబర్ 21న విడుదలైన 'కేజీఎఫ్ ఛాప్టర్ 1'.. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడంతో.. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఛాప్టర్ 2పైనే ఉంది. దానికి తోడు టీజర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
టీజర్ రిలీజయ్యాక 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' రిలీజ్ డేట్ పై మరింత ఆసక్తి నెలకొంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా వేసవిలో రాబోతుందంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే.. ఆ కథనాలకు తెరదించుతూ ఈ రోజు 'కేజీఎఫ్' టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. జూలై 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సినిమా సందడి చేయబోతోందంటూ యూనిట్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది.
మరి.. 'కేజీఎఫ్ ఛాప్టర్ 1'తో పాన్ ఇండియా ఇమేజ్ పొందిన రాకీ భాయ్ యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ సారి ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తారో చూడాలి. కాగా, 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'లో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి ప్రముఖ బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రల్లో నటించారు.

![]() |
![]() |