![]() |
![]() |

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'బిగ్ థాంక్యూ' చెప్పారు... తెలుగు రాష్ట్రాల్లోని సినీ కార్మికులకు సాయం చేస్తున్నందుకు! తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల సంక్షేమం కోసం అమితాబ్ బచ్చన్ 12000 కరోనా రిలీఫ్ కూపన్లు పంపిస్తున్నారు. ఒక్కో కూపన్ విలువ 1500 రూపాయలు. అంటే... బిగ్ బి చేస్తున్న సాయం విలువ అక్షరాలా కోటీ ఎనభై లక్షల రూపాయలు (రూ. 1.80 కోట్లు). ఎక్కడైనా బిగ్ బజార్ స్టోర్లలో ఈ కూపన్లను ఉపయోగించుకోవచ్చు. తమ కుటుంబ అవసరాలకు వినియోగించుకోవచ్చు.
పెద్ద మనసుతో తెలుగు సినీ కార్మికుల కోసం సాయం చేయడానికి ముందుకొచ్చిన అమితాబ్ వితరణ పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఆల్రెడీ కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసిన చిరంజీవి, ఇండస్ట్రీలోని ప్రముఖుల సహాయ సహకారాలతో సినీ కార్మికులకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్మికుల ఇంటి వద్దకు వెళ్లి 25 కిలోల రైస్ బస్తాతో పాటు నిత్యావసర వస్తువులను సీసీసీ అందిస్తోంది.
![]() |
![]() |