![]() |
![]() |

'రన్ రాజా రన్', 'సాహో' చిత్రాల దర్శకుడు సుజీత్ తన ప్రేయసి ప్రవల్లికతో వివాహ నిశ్చితార్ధం చేసుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు అమలులో ఉండటం వల్ల ఆడంబరానికి పోకుండా సింపుల్‌గా కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వారి నిశ్చితార్ధం జరిగింది. ఈ కార్యక్రమం కోసం సుజీత్ షేర్వాణీ ధరించగా, ప్రవల్లిక సంప్రదాయ పట్టుచీరలో మెరిసింది. మీడియా కెమెరాకు దూరంగా ఈ వేడుక జరిగింది. ఒకట్రెండు ఫొటోలు మాత్రమే సోషల్ మీడియాలో లీకయ్యాయి.
దంత వైద్యురాలైన ప్రవల్లిక, సుజీత్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే దీన్ని కొద్ది రోజుల క్రితం వరకూ రహస్యంగానే ఉంచారు. తమ ప్రేమబంధాన్ని పెళ్లిబంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్న దానికి అనుగుణంగా ఇప్పుడు నిశ్చితార్ధం చేసుకున్నారు. ఆగస్ట్‌లో వారి వివాహం జరుగుతుందని వినిపిస్తోంది కానీ అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.
'రన్ రాజా రన్' వంటి హిట్ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమైన సుజీత్, తన రెండో సినిమాలోనే బాహుబలి ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ పొంది, 'సాహో' తీశాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాని మెగాస్టార్ చిరంజీవితో చేసేందుకు రెడీ అవుతున్నాడు. అది.. మలయాళ బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్' రీమేక్.
![]() |
![]() |