![]() |
![]() |

ఇప్పటివరకు తాను ప్రేమలో పడలేదని 'మిర్చి' లాంటి ఐటమ్ భామ హంసా నందిని చెబుతోంది. తనకు ఎక్స్ ఎవరూ లేరని ఆమె సెలవిచ్చింది. బ్రేకప్ అయిన తర్వాత అంతకు ముందు ప్రేమలో ఉన్నవాళ్లను 'ఎక్స్ లవర్' లేదా 'ఎక్స్ బాయ్ ఫ్రెండ్' అంటారు. తనకు ఎక్స్ లేరని హంసా నందిని చెప్పారంటే... అర్థం ఏమిటి? ప్రేమలో పడలేదనే కదా! ఎప్పుడూ ఎవరికీ ఐ లవ్యూ చెప్పలేదనీ, ఎవరినీ చీట్ చేయలేదని ఆమె అన్నారు. ఇంకా తన జీవితంలో చిలిపి సంగతులు, సరదా విషయాల గురించి హంసా నందిని ఇలా చెప్పుకొచ్చారు.
షూటింగులకు డుమ్మా కొట్టడం కోసం కొన్నిసార్లు అబద్దాలు చెప్పానని ఆమె అన్నారు. స్కూల్ ఎగొట్టడానికి పిల్లలు, ఆఫీసులకు డుమ్మా కొట్టడానికి పెద్దలు అబద్దాలు చెప్పినట్టు అన్నమాట. చాలాసార్లు పరీక్షల్లో చీట్ చేశారట. ఇంకా, ఇతరుల అనుమతి లేకుండా కొన్నిసార్లు వాళ్ల ఫోను చెక్ చేశానని హంసా నందిని అన్నారు. ఒంటిపై నూలుపోగు లేకుండా అన్నీ విప్పేసి నగ్నంగా ఈతకొట్టానని, జలకాలాటలలో మునిగి తేలానని ఆమె తెలిపారు. తన వయసు గురించి ఎప్పుడూ అబద్దం చెప్పలేదని హంసా నందిని స్పష్టం చేశారు.
![]() |
![]() |