![]() |
![]() |

తెలుగులో 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కుష్బూ.. ఆ తర్వాత పలు భాషల్లో నటించి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక తమిళనాడులో అయితే ఆమె అభిమానులు ఏకంగా ఆమెకి గుడే కట్టారు. హీరోయిన్ గా అంతటి స్టార్ డమ్ ని అనుభవించిన ఆమె.. ఓ వైపు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంది. అయితే హీరోయిన్ గా ఉన్న సమయంలో ఆమెకి కూడా వేధింపులు ఎదురయ్యాయంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు.
తాను హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో టాలీవుడ్ అగ్ర హీరో ఒకరు తనను కమిట్‌మెంట్ అడిగినట్లు కుష్బూ చెప్పుకొచ్చింది. ఆ స్టార్ హీరో కమిట్‌మెంట్ అడిగేసరికి చాలా కోపం వచ్చిందని.. దాంతో మీ చెల్లెలిని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే.. తాను కూడా కమిట్‌మెంట్ ఇస్తానని చెప్పినట్లు కుష్బూ వెల్లడించింది. అప్పట్నుంచి ఆ హీరోతో తనకు మాటలు లేవని ఆమె తెలిపింది.
అయితే తనను కమిట్‌మెంట్ అడిగిన ఆ హీరో పేరు చెప్పేందుకు కుష్బూ నిరాకరించింది. దీంతో ఆ హీరో ఎవరు అయ్యింటారా అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. కుష్బూ తక్కువమంది హీరోలతోనే కలిసి నటించింది. మరి ఆ తక్కువమంది హీరోల్లో కుష్బూను కమిట్మెంట్ కోరి చెంపపెట్టు లాంటి సమాధానం ఎదుర్కొన్న హీరో ఎవరో మరి.
![]() |
![]() |