![]() |
![]() |

గత ఏడాది చివరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`)తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశారు కోలీవుడ్ స్టార్ సూర్య. ఈ నేపథ్యంలో.. సూర్య నుంచి రాబోయే చిత్రాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరీముఖ్యంగా.. తన తమ్ముడు కార్తితో `కడైకుట్టి సింగమ్` (తెలుగులో `చినబాబు`) వంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న కొత్త సినిమా గురించి ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
పొల్లాచి ప్రాంతంలో మహిళలపై జరిగిన హత్యాచార ఘటనల నేపథ్యాన్ని కథాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పాండిరాజ్. ఇందులో బాధిత మహిళల తరపున పోరాడుతూ, న్యాయం కోసం రాజకీయ నాయకులను వ్యతిరేకించే వ్యక్తి పాత్రలో సూర్య కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. కాగా, సూర్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 23న ఫస్ట్ లుక్, టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది.
కాగా, సూర్య 40వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటిస్తుండగా.. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
![]() |
![]() |