![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'గాడ్‌ఫాదర్' మూవీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ చేయనున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మలయాళం బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్'కు 'గాడ్‌ఫాదర్' రీమేక్. ఒరిజినల్లో మోహన్‌లాల్ చేసిన టైటిల్ రోల్‌ను తెలుగు రీమేక్‌లో చిరంజీవి చేస్తున్నారు. అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన స్పెషల్ క్యారెక్టర్‌ను సల్మాన్ చేయనున్నాడు. ముంబై సమీపంలోని కర్జత్‌లో ఉన్న స్టూడియోలో మార్చి 12 నుంచి చిరంజీవి, సల్మాన్‌పై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ షూటింగ్ నిజానికి జనవరిలో జరగాల్సింది కానీ చిరంజీవి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆలస్యమైంది. ఆ తర్వాత సల్మాన్ 'టైగర్ 3' ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌తో బిజీ అయ్యాడు. ఇప్పుడు అన్నీ కుదరడంతో మార్చి 12 నుంచి కర్జత్‌లోని ఎన్డీ స్టూడియోస్‌లో షూటింగ్ జరపనున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ షూటింగ్లో కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు కీలక సన్నివేశాల్ని తీయనున్నారు.
ఈ షూటింగ్ నిమిత్తం చిరంజీవి ముంబైకి వెళ్తున్నారు. ఆయన సల్మాన్‌కు చెందిన పన్వేల్ ఫామ్‌హౌస్‌లో బస చేయనున్నట్లు సమాచారం. బిగ్ స్క్రీన్‌పై చిరంజీవి, సల్మాన్ లాంటి బిగ్ స్టార్స్‌ను చూడటం ఫ్యాన్స్‌కు పండగ కానున్నది.
జయం రాజా డైరెక్ట్ చేస్తున్న 'గాడ్‌ఫాదర్'లో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై సురేఖ సమర్పిస్తోన్న ఈ మూవీని సూపర్‌గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
![]() |
![]() |