![]() |
![]() |

'డాక్టర్ సలీమ్', 'బిచ్చగాడు', 'బేతాళుడు' వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా 'హత్య' తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా.. హీరోయిన్ రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది.
లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ మూవీకి బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా 'హత్య' సినిమా సాగనుంది. అందమైన మోడల్ లీల తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు అనేది మిస్టరీగా మారుతుంది. డిటెక్టివ్, పోలీస్ కోణంలో ఈ కేసు ఛేదనలో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాధికా శరత్‌కుమార్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.

కాగా, ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి 'విజయ్ రాఘవన్' అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో 'హత్య' సినిమా నిర్మితమవుతుండగా.. త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేస్తున్నారు.
![]() |
![]() |