Home

»

Latest News

నాకు 'ట్రిపోఫోబియా' ఉంది: లావణ్య త్రిపాఠి

Aug 12, 2021 4:13PM

'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ సొట్టబుగ్గల సుందరికి ఓ సమస్య ఉందట.

తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న లావణ్య అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తనకు 'ట్రిపోఫోబియా' ఉందని తెలిపింది. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే తనలో భయం కలుగుతుందని చెప్పింది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను కాంక్రీట్ జంగిల్ కు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్నానని లావణ్య చెప్పింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుందని అభిమానులకు సూచనలు చేసింది. అలాగే, తను నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, అందుకే ప్రస్తుతం తను స్వల్ప విరామం తీసుకోవాలనుకుంటున్నట్లుగా తెలిపింది. త్వరలోనే మంచి కథతో మీ ముందుకు రాబోతున్నానని లావణ్య పేర్కొంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com