![]() |
![]() |

విజయ్ హీరోగా నటించే 65వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ గురువారం ప్రకటించింది. తాత్కాలికంగా 'దళపతి65'గా పిలుస్తున్న ఈ మూవీకి 'కొలమావు కోకిల' ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. అనౌన్స్‌మెంట్‌తో పాటు నిర్మాతలు ఓ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. దాన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో గన్స్, బుల్లెట్స్‌కు కొదవ వుండదని అర్థమవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో విజయ్‌కు ఇది నాలుగో సినిమా. ఇదివరకు వారి కాంబినేషన్‌లో వేట్టైకారన్, సుర, సర్కార్ సినిమాలు వచ్చాయి.
నెల్సన్ ప్రస్తుతం తన రెండో చిత్రం 'డాక్టర్'ను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అందులో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. అంటే తన మూడో సినిమాలోనే విజయ్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ అతనికి లభించిందన్న మాట. మరోవైపు 'మాస్టర్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు విజయ్. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతూ వస్తోంది. సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమా వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇంతదాకా నిర్మాతల నుంచి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన 'మాస్టర్'లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా, మాళవికా మోహనన్ హీరోయిన్‌గా చేసింది.
![]() |
![]() |