![]() |
![]() |

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో యష్, రాధికా పండిట్ స్టార్ కపుల్‌గా ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. తమకూ, తమ పిల్లలకూ సంబంధించిన పిక్చర్స్, వీడియోస్ షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తూ వస్తున్నారు ఆ జంట. తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా రాధిక షేర్ చేసిన ఫొటో ఫ్యాన్స్‌కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అందులో ఆమె బుగ్గపై యష్ ముద్దు పెట్టుకుంటున్నాడు మరి! అంతేకాదు.. అందమైన రెడ్ రోజ్ బొకేతో ఆమెను సర్‌ప్రైజ్ కూడా చేశాడు. ఈ ఫొటోను షేర్ చేసి, తనపై యష్ చూస్తున్న ప్రేమకు థాంక్స్ చెప్పారు.
గురువారం ఆ ఇద్దరూ తమ నాలుగో పెళ్లి రోజును జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇద్దరి అభిమానులూ సోషల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాధిక కూడా ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఫొటో షేర్ చేసిన రాధిక, “Dear Husband... thank you #radhikapandit #nimmaRP P.S: We want to thank all our fans n well wishers for making our day so special yday!” అంటూ రాసుకొచ్చింది. ఆమె ఆ ఫొటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే కామెంట్స్ సెక్షన్‌లో అభిమానులు ఆ ఇద్దరినీ అభినందనల వర్షంలో ముంచెత్తేశారు.

వర్క్ విషయానికి వస్తే, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'కేజీఎఫ్: చాప్టర్ 2' మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్నాడు యష్. హైదరాబాద్‌లో దాని షూటింగ్ జరుగుతోంది. 2021 సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు.

![]() |
![]() |