![]() |
![]() |

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆదివారం సాయంత్రం కియారా అద్వానీ బయటకు వెళ్ళింది. ముంబైలోని బాంద్రాలో వాళ్ళిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. సిద్ధార్థ్ కారు డ్రైవ్ చేస్తుంటే... అతడి పక్కన ఫ్రంట్ సీటులో కియారా కూర్చుంది. ఇద్దరూ పేస్ మాస్క్ లు వేసుకుని ఉన్నారు. డిన్నర్ చేసిన తరవాత ఇంటికి వెళ్లారట. ముంబై సినిమా సర్కిళ్లలో ఇప్పుడీ కొత్త ప్రేమ పక్షుల గురించే డిస్కషన్.
ఇప్పటివరకూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. ప్రస్తుతం 'షేర్ షా' అని ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్‌పై ప్రేమలో పడ్డారని బాలీవుడ్ గుసగుస. గతంలో కొంతమంది హీరోయిన్లతో సిద్ధార్థ మల్హోత్రా పేరు వినిపించింది. కానీ, ఎవరితోనూ ఎక్కువరోజులు ప్రేమకథ నడపలేదని అంటుంటారు. మరి, కియారాతో కంటిన్యూ అవుతాడో, లేదో చూడాలి.

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు జంటగా 'భరత్ అనే నేను'లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. తరవాత రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లోనూ నటించింది. కానీ, అది హిట్ కాలేదు. దాంతో తెలుగులో మహేష్ హీరోయిన్‌గా గుర్తుండిపోయింది.
![]() |
![]() |