![]() |
![]() |

హీరో కార్తికేయ తన ఫియాన్సీ లోహితా రెడ్డికి సినిమా స్టైల్‌లో అందరి ముందూ ప్రపోజ్ చేశాడు. ఈ ఘటన 'రాజా విక్రమార్క' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చోటు చేసుకుంది. కార్తికేయ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'రాజా విక్రమార్క' ఈనెల 12న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కార్తికేయ కాబోయే భార్య లోహిత కూడా వచ్చింది. మొదట సినిమా గురించి మాట్లాడిన కార్తికేయ, ఆ తర్వాత స్టేజి మీదకు లోహితను పిలిచి, ఆమెను అందరికీ పరిచయం చేశాడు.
లోహితతో తన ప్రేమకథను వెల్లడిస్తూ, "మొదట నేనే తనకు ప్రపోజ్ చేశాను. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా. ఆ రోజే 'నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతా' అని చెప్పా. ఫైనల్లీ.. ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్, ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్" అని చెప్పాడు. అనంతరం వేదికపై లోహితకు మోకాళ్లపై కూర్చొని సినీ స్టైల్‌లో ప్రపోజ్ చేసి, అందరినీ అలరించాడు.
2010లో వరంగల్ ఎన్ఐటీలో చదువుకొనేటప్పుడు తొలిసారి లోహితను కలుసుకున్నాడు కార్తికేయ. ఈ ఏడాది ఆగస్ట్ 22న ఆ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ కుటుంబసభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్య జరిగింది. దీనికి సంబంధించిన ఒక ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన కార్తికేయ, "ఇప్పుడు నా జీవిత భాగస్వామ కాబోతున్న నా బెస్ట్ ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిందని అనౌన్స్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. నిట్ వరంగల్‌లో లోహితను తొలిసారి 2010లో కలుసుకున్నాను." అని ట్వీట్ చేశాడు.

![]() |
![]() |