![]() |
![]() |

నాగ చైతన్యతో విడాకుల తర్వాత కూడా సమంత జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్న సమంత తన రెమ్యునరేషన్ పెంచేసింది అని న్యూస్ రాగా.. ఇప్పుడు 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)'లో స్పీకర్ గా ఆహ్వానం అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ వస్తున్నాయని, త్వరలోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో సమంత ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి వచ్చింది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రసంగించేందుకు సమంతకి ఆహ్వానం అందింది. IFFIలో ప్రసంగించేందుకు ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ ఇండియా నటి సమంత కావడం విశేషం.
సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' సినిమాలో నటిస్తోంది.
![]() |
![]() |