![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ లకు సోషల్ మీడియాలో బోలెడంత క్రేజ్ ఉంది. వాళ్ళకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అర్హ అయితే 'శాకుంతలం' సినిమాతో వెండితెర ఎంట్రీ కూడా ఇస్తుంది. ఇక ఇప్పుడు అయాన్ కూడా హీరో వేషాలు వేస్తున్నాడు. అయాన్ వర్కౌట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గని'. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన గని టైటిల్ సాంగ్ ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ కి అయాన్ వర్కౌట్ వీడియోని జోడించి ఆ సర్ ప్రైజ్ వీడియోని గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎనర్జీ, స్టైల్, లుక్స్ లో అయాన్ బన్నీని గుర్తు చేస్తున్నాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |