![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. నటుడిగా ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. పునీత్ మరణం తర్వాత ఆయన చేసిన సేవని గుర్తు చేసుకుంటున్నారంతా. అయితే తాజాగా పునీత్ చేసిన గొప్ప పని ఒకటి వెలుగులోకి వచ్చింది. అది తెలిసి పునీత్ మనిషి రూపంలో జన్మించిన దేవుడు అంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
పునీత్ మరణం తర్వాత ఆయన చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఎందరికో ఉచిత విద్యని అందిస్తున్నారు. ఫ్రీ స్కూళ్లు, అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నారు. అయితే తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ కూడదన్న ఉద్దేశంతో ముందు చూపుగా ఒక పని చేశారట పునీత్. అదేంటంటే, ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగినా సేవా కార్యక్రమాలు కొనసాగేలా.. ముందు జాగ్రత్తగా 8 కోట్ల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారట పునీత్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పునీత్ గొప్ప మనస్సుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, పునీత్ తన కళ్ళని కూడా దానం చేసిన సంగతి తెలిసిందే. ఆయన కళ్ళతో నలుగురికి చూపు దక్కడం విశేషం.
![]() |
![]() |